తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధిత కుటుంబాలకు లక్ష్మణ్​ పరామర్శ

నాగర్​ కర్నూల్​ జిల్లా మహదేవునిపేట, డోకూరు గ్రామాల్లోని బాధితులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పరామర్శించారు. తెరాస ఓటమి జీర్ణించుకోలేక ఈ దాడులకు పాల్పడిందని ఆగ్రహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

బాధిత కుటుంబాలకు లక్ష్మణ్​ పరామర్శ

By

Published : Jun 6, 2019, 2:31 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో బుధవారం రాత్రి జరిగిన దాడిలో తీవ్రగాయాలపాలైన భాజపా ఎంపీటీసీ అభ్యర్థి వరలక్ష్మిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహబూబ్​నగర్​ ఎస్వీఎస్​ ఆస్పత్రిలో వరలక్ష్మి చికిత్స పొందుతున్నారు.

బాధిత కుటుంబాలకు లక్ష్మణ్​ పరామర్శ

అనంతరం దేవరకద్ర మండలం డోకూరులో బుధవారం తెల్లవారుజామున హత్యకు గురైన భాజపా కార్యకర్త ప్రేమ్​ కుమార్​ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రేమ్​ కుమార్​ హత్యను తీవ్రంగా ఖండించారు. తెరాస ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకే ఈ దారుణానికి ఒడిగట్టారని నిప్పులు చెరిగారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇవీ చూడండి: ఒక్కరు మిగిలారు... విలీనమే తరువాయి...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details