నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదానికి గురైన ఎల్లూరు లిఫ్ట్ రెండో పంపు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించి... శ్రీశైలం మిగులు జలాల నుంచి రెండో పంపు ద్వారా నీటి ఎత్తిపోతను అధికారులు పునరుద్ధరించారు.
కేఎల్ఐ పథకంలో మొదటి పంపు హౌజ్ ఎల్లూరు లిఫ్ట్‌లో అక్టోబర్ 16న పెద్ద శబ్దంతో మూడో మోటారు ప్రమాదానికి గురైంది. ఫలితంగా పంప్ హౌజ్ నిండా నీరు చేరి ఎత్తిపోత ఆగిపోయింది. సుమారు రెండు నెలల పాటు శ్రమించిన అధికారులు నీటిని ఎత్తిపోసి మోటార్లకు మరమ్మతులు చేశారు. నవంబర్ 21న మొదటి పంపును ప్రారంభించారు. మరో పది రోజుల పాటు మరమ్మతులు చేపట్టి రెండో పంపుని పునరుద్ధరించారు. ప్రస్తుతం ఒక్కో మోటార్‌కు 800 క్యూసెక్కుల చొప్పున ఎల్లూరు రిజర్వాయర్‌ను నింపడానికి నీటిని ఎత్తిపోస్తున్నారు.