తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణ సమతుల్యతకు హరితహారమే మార్గం: ఎమ్మెల్యే - మెుక్కలు నాటిన ఎమ్మెల్యే

వాతావరణంలో చోటుచేసుకుంటున్న పలు మార్పులను అరికట్టాలంటే మెుక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నాటిన ప్రతి మెుక్కను రక్షించాలని సూచించారు.

kalwakurthy  mla jaipal yadav participated in harithahara programme in nagarkurnool district
మెుక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Jun 25, 2020, 5:33 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కార్యక్రమం హరితహారమని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మెుక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకుంటున్న పలు మార్పులను అరికట్టాలంటే అత్యధికంగా మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల సభ్యులు చొరవ తీసుకుని నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్​ ఛైర్మన్​ సత్యం, జడ్పీటీసీ ప్రసాద్, ఎంపీపీ సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్ గౌడ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details