Jupalli KrishnaRao on Paddy :నాగర్‌కర్నూల్ జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేపట్టిన ఆందోళన.. ఉద్రిక్తంగా మారింది. రైతులకు న్యాయం చేయాలంటూ వారితో కలిసి కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అయినా కలెక్టర్ అక్కడికి రాలేదు. దీంతో అక్కడి నుంచి ఆయన కార్యకర్తల వెంట ర్యాలీగా తరలి వెళ్లి.. కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
Jupalli Dharna in Nagarkurnool :కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కూడా జూపల్లి కృష్ణారావుకు ఎలాంటి హామీ రాకపోవడంతో.. అక్కడే ఉన్న మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూపల్లి అనుచరులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనకు నచ్చచేప్పేందుకు ప్రయత్నించారు.
పోలీసులకు జూపల్లి అనుచరుల మధ్య వాగ్వాదం:ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు తనకు కలెక్టర్ నుంచి లిఖితపూర్వకంగా హామీ వస్తే.. ఆందోళన విరమిస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు రోడ్డుపై వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు కలగజేసుకొని జూపల్లిని అదుపులోకి తీసుకొని. పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా ఆయన అనుచరులు అడ్డు తగిలారు. ఇందులో భాగంగానే వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.