తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించాలి.. అధికారుల అజమాయిషీ తగ్గించాలి'

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్​ను ఐకేపీ వీఓఏ ఉద్యోగులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

IKP VOA employees held a dharna in front of Nagar Kurnool District Collector to resolve the issues
సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ వీఓఏ ఉద్యోగుల డిమాండ్

By

Published : Feb 25, 2021, 7:04 PM IST

అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఐకేపీ వీఓఏ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులను గుర్తించి.. పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు.

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ వీఓఎస్ ఉద్యోగులు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్​ ముట్టడించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పాలనాధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వెలుగు ఉద్యోగులపై ఉన్నతాధికారుల అజమాయిషీ తగ్గించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపర డిమాండ్లు తక్షణమే తీర్చాలని పట్టుపట్టారు.

ఇదీ చూడండి:సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: ఆర్​.నారాయణమూర్తి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details