నాగర్‌కర్నూలు జిల్లా హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జలాశయం గేట్లు ఎత్తిన సందర్భంగా డ్యామ్ తిలకించడానికి వచ్చే సందర్శకుల తాకిడి ఎక్కువైంది. జలాశయం నుంచి దోమలపెంట వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోవడం వల్ల సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దట్టమైన నల్లమల అడవి ప్రాంతం కావడం.. చుట్టుముట్టు చీకటి ఉండడం వల్ల బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. అమ్రాబాద్ మండలం పర్హాబాద్ దగ్గర ఆటోలో వస్తున్న ప్రయాణికులపై చిరుత పులి దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీశైలానికి సందర్శకుల తాకిడి.. భారీగా ట్రాఫిక్ జామ్ - Heavy traffic
శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తడం వల్ల.. డ్యామ్ అందాలను వీక్షించడానికి సందర్శకులు పోటెత్తారు. వీరి తాకిడి ఎక్కువగా ఉండటం శ్రీశైలం రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
భారీగా ట్రాఫిక్ జామ్
ఇవీ చూడండి: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అతిథుల పేర్లు ఖరారు