సోమవారం రాత్రి నుంచి నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వరదనీటితో వాగులు, వంకలు పొర్లుతున్నాయి. అచ్చంపేట మండలంలోని చెంచుపల్గు తాండా, చౌటపల్లి వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి నీరు పారుతోంది. బ్రిడ్జిపై రోడ్డు కొట్టుకుపోయింది. మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఎడతెరిపిలేని వర్షం... పొంగుతున్న వాగులు, వంకలు - తెలంగాణ తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షానికి నాగర్కర్నూల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
ఎడతెరిపిలేని వర్షం... పొంగుతున్న వాగులు, వంకలు
భారీ వర్షాలతో ఈ ఏడాదిలో మొదటిసారిగా చంద్రసాగర్వాగు నిండుకుండలా మారింది. వాగును చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు.
ఇదీ చూడండి:ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు