పాపను గుర్తించిన సిబ్బంది శనివారం సాయంత్రం కన్నబిడ్డను వదిలి వెళ్లిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ మహిళ తన ఆరు నెలల పాపకు పాలిచ్చి.. అనంతరం ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లింది. సుమారు గంట తర్వాత శిశువు ఏడుస్తున్న విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఐసీడీఎస్‌కు అప్పగింత
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి వరకు పాప తల్లి కోసం గాలించిన తర్వాత పాపను ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.