నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - ELECTION COUNTING
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియం ప్రారంభమైంది. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ బాక్స్‌లను వేర్వేరుగా చేసి ఒక్కో బ్యాలెట్లో 25 కట్టలుగా విభజించారు. అనంతరం ఎంపీటీసీ పత్రాలను లెక్కిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 20 జడ్పీటీసీ, 212 ఎంపీటీసీ స్థానాలున్నాయి. రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఒక ఎంపీటీసీ స్థానం రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మిగిలిన 209 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
TAGGED:
ELECTION COUNTING