తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాగర్​కర్నూల్​లో పోలింగ్​కు సర్వం సిద్ధం'

పార్లమెంటు ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పర్యవేక్షిస్తున్నారు. నాగర్​ కర్నూల్​లో పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. ఈసీ సూచించిన గుర్తింపు కార్డులతోనే ఓటు వేయాలని కలెక్టర్​ శ్రీధర్​ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటెయ్యాలని సూచించారు.

శ్రీధర్​ ఐఏఎస్​

By

Published : Apr 9, 2019, 7:03 PM IST

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. నియోజక వర్గ పరిధిలో 15 లక్షల 50 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,936 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్​ శ్రీధర్​ తెలిపారు. ఈసీ సూచించిన గుర్తింపు కార్డులతో ఓటర్లు ఓటెయ్యాలని సూచిస్తున్న శ్రీధర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details