తెలంగాణ

telangana

ETV Bharat / state

తూఫాన్​ వాహనం బోల్తా... ఎనిమిది మందికి గాయాలు

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కొల్లాపూర్​ మండలం అంకిరావుపల్లి వద్ద తూఫాన్​ వాహనం బోల్తాకొట్టింది.  చరవాణిలో మాట్లాడుతూ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఘటనలో ఎనిమిది మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.

తుపాన్​ వాహనం బోల్తా... ఎనిమిది మందికి గాయాలు

By

Published : Nov 22, 2019, 10:58 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి స్టేజి దగ్గర తూఫాన్ వాహనం బోల్తాపడింది. ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కొల్లాపూర్ నుంచి 18 మంది ప్రయాణికులతో తూఫాన్​ వాహనం హైదరాబాద్​కు బయలుదేరింది. అంకిరావుపల్లి స్టేజి దగ్గరకు రాగానే అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయి బోల్తాకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 18 మంది ఉన్నారు. గాయపడిన ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మహబూబ్​నగర్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ ఫోన్​లో​ మాట్లడుతూ... అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తుపాన్​ వాహనం బోల్తా... ఎనిమిది మందికి గాయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details