పేద ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటూ.. ఒక అన్నలా బిడ్డలను ఆదుకుంటుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ. 4 కోట్ల 30 లక్షల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నాగర్‌కర్నూల్, తిమ్మాజీపేట్, బిజినాపల్లి మండలాలకు చెందిన 403 మందికి లబ్ధి చేకూరింది.
నాగర్‌కర్నూల్‌లో చెక్కుల పంపిణీ
పేద ప్రజలకు అండగా ఉండేందుకే అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
నాగర్‌కర్నూల్‌లో చెక్కుల పంపిణీ
ఒకప్పుడు బీడుపడ్డ పంట పొలాలు ఇప్పుడు పచ్చగా మరాయని... రైతులు మూడు కాలాల్లో పంటలు పండించుకుంటున్నారని ఇదీ కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.కరోనాను జయించిన 86 ఏళ్ల వృద్ధుడు