నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవా ఈ రోజు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాలతో పట్టణ ప్రధాన రోడ్లపై ఊరేగింపు నిర్వహించారు. పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. శుక్రవారం నవరాత్రులు కలిసి రావడం వల్ల ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వందల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి నామస్మరణతో మారు మోగిన కొల్లాపూర్ - durgadevi
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఇవాళ అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
అమ్మవారి నామస్మరణతో మారు మోగిన కొల్లాపూర్