నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని ఓ కాలనీలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగి హైదరాబాదులోని చెస్ట్ హాస్పిటల్ నందు చికిత్స పొందారు. ఆ తదుపరి జరిగిన పరీక్షలో కరోనా నెగిటివ్‌గా తేలింది. ఈరోజు అతనికి నెగిటివ్ రిపోర్ట్‌ను అందిస్తూ... వైద్యుడు పానుగంటి జాన్సన్ మాట్లాడారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులపై వివక్ష చూపించొద్దని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రతి వ్యక్తి అనారోగ్యానికి గురికాక తప్పదని అలాంటి వ్యక్తులపై సమాజంలోని ఇతర వ్యక్తులు వివక్షతను చూపించకూడదన్నారు. విపత్కర పరిస్థితుల్లో అనారోగ్యం పాలైన వ్యక్తులకు అండగా నిలిచేందుకు తోటి సమాజం ముందుకు రావాలని సూచించారు.
'క్వారంటైన్ పూర్తయిన వ్యక్తులపై వివక్ష వద్దు' - covid-19 latest news
కరోనా పాజిటవ్ నిర్ధారణ అయిన వ్యక్తులపై వివక్ష చూపించకూడదని వైద్యుడు పానుగంటి జాన్సన్ అన్నారు. కల్వకుర్తిలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని కలుసుకొని పూలమాలతో సత్కరించారు. భయపడొద్దని ధైర్యం చెప్పారు.
'క్వారంటైన్ పూర్తి అయిన వ్యక్తులపై వివక్ష వద్దు'
కల్వకుర్తిలో ఇటీవల వైరస్ సోకి కోలుకున్న వ్యక్తిని డాక్టర్ జాన్సన్ శాలువా పూలమాలతో సత్కరించారు. అనంతరం చికిత్స పొందిన వ్యక్తిని ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు తోటి వ్యక్తులు ఏమీ కాదు అని ఇచ్చే ధైర్యంతోనే సగం రోగం తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్మన్ ఎడ్మ సత్యం, కమిషనర్ జాకీర్ అహ్మద్, పుర సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 11 మందికి కరోనా పాజిటివ్