తెలంగాణ

telangana

ETV Bharat / state

10 లక్షలు ఇచ్చి బెదిరించారు.. ఇవిగో నోట్ల కట్టలు - congress

తెరాస నేతలు తనను బెదిరించి నామినేషన్​ ఉపసంహరించుకునేట్లు చేశారని గగ్గలపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి దొడ్ల వెంకటనారాయణ డీఆర్​వోకు ఫిర్యాదు చేశారు. తెరాస అభ్యర్థి అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

10 లక్షలు ఇచ్చి బెదిరించారు

By

Published : Apr 29, 2019, 9:53 PM IST

తెరాస అభ్యర్థి తనను బెదిరించి నామినేషన్​ ఉపసంహరించుకునేట్లు చేశారని నాగర్​కర్నూల్​ జిల్లా గగ్గలపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి దొడ్ల వెంకటనారాయణ డీఆర్​వోకు ఫిర్యాదు చేశారు. తనకు రూ.10 లక్షల నగదు ఇచ్చారని తెలిపారు. నోట్లకట్టలు తీసుకుని డీఆర్​వో ఆఫీసుకు వచ్చారు. అనంతరం డబ్బు కట్టలను మీడియా ముందు ప్రదర్శించారు. తెరాస అభ్యర్థి దొడ్ల ఈశ్వర్​రెడ్డి అనుచరులు కారులో ఎక్కించుకొని.. బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్​ అభ్యర్తి నామినేషన్​ వెనక్కి తీసుకోవడం ఫలితంగా తెరాస అభ్యర్థి దొడ్ల ఈశ్వర్​రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.

10 లక్షలు ఇచ్చి బెదిరించారు

ABOUT THE AUTHOR

...view details