తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 9న నల్లమల బంద్​కు కాంగ్రెస్ పిలుపు - నల్లమల

కేంద్ర ప్రభుత్వం నల్లమల ప్రాంతంలో చేపట్టిన యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న నల్లమల బంద్​కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

నల్లమల బంద్​కు కాంగ్రెస్ పిలుపు

By

Published : Sep 7, 2019, 1:57 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట నల్లమల ఏజెన్సీ ప్రాంతం అమ్రాబాద్, పదర మండలాల్లో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. తెలంగాణ ఊటీగా పేరొందిన.. నల్లమల ప్రాంతాన్ని యూరేనియం తవ్వకాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వల్లకాడుగా మార్చాలని కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. యూరేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రజల జీవనంపై పెను ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరేనియం తవ్వకాల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదకర యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈనెల 9న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లమల బంద్​కు నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు.

నల్లమల బంద్​కు కాంగ్రెస్ పిలుపు

ABOUT THE AUTHOR

...view details