దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ యోధుడు మాచర్ల వీరన్న గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నివాళులు అర్పించారు. వీరన్న గౌడ్ గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. శనివారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. దొరల పాలనకు ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి వీరన్న గౌడ్ అని సీపీఐ నాయకులు గుర్తు చేసుకున్నారు. వీరన్న గౌడ్ విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాలు చేసి పేద ప్రజల సమస్యలు పట్ల పోరాడారని కొనియాడారు. పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని స్పష్టం చేశారు. వీరన్న కుటుంబాన్ని వారు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
కమ్యూనిస్ట్ నేత వీరన్న గౌడ్ అస్తమయం - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
దొరల పాలనకు ఎదురొడ్డి నిలిచి, ఆనాటి యువతలో ధైర్యం నింపిన కమ్యునిస్ట్ నేత వీరన్న గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ.. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లి గ్రామానికి చెందిన కామ్రేడ్ వీరన్న గౌడ్ దొరలపాలనకు ఎదురొడ్డి నిలిచారు. బడుగు, బలహీన వర్గాల వారికి అండగా నిలబడి.. రెడ్డి, దొరల పాలనకు చమరగీతం పాడారు. ఆనాటి యువతలో ధైర్యం నింపి... గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై.. పలు అభివృద్ధి పనులకు నాంది పలికారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కామ్రేడ్ వీరన్నగౌడ్ పార్థివ దేహానికి మాజీ మంత్రి జూపల్లి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లావెంకట్ పెడ్డి, గ్రామ సర్పంచ్ నాగ రవిశంకర్, జడ్పీటీసీ మాకం పార్వతమ్మ, పార్టీలకతీతంగా తెరాస, కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. చివరిచూపు కోసం గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇవీ చూడండి: అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..