తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు - నాగర్​కర్నూల్​

నాగర్​కర్నూల్​ జిల్లాలోని నెల్లికొండ మార్కెట్​ గోదాం, ఉయ్యాలవాడ వద్దనున్న కళాశాలలో ఓట్లు లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్​ శ్రీధర్​ తెలిపారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు

By

Published : May 21, 2019, 10:27 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లాలో లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్​ శ్రీధర్​ తెలిపారు. నెల్లికొండ మార్కెట్​ గోదాం, ఉయ్యాలవాడ సమీపంలోని బీఎడ్​ కళాశాలల వద్ద చేసిన లెక్కింపు కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు దినేష్​తో కలిసి నాగర్​కర్నూల్​, వనపర్తి, గద్వాల జిల్లా కలెక్టర్లు శ్రీధర్​, శ్వేతామహంతి, శశాంక పరిశీలించారు. నాగర్​కర్నూల్​, కొల్లాపూర్​, అచ్చంపేట నియోజవర్గాలకు నెల్లికొండ వ్యవసాయ మార్కెట్​ గోదాం వద్ద, గద్వాల, వనపర్తి, కల్వకుర్తి, అలంపూర్​ నియోజకవర్గాలకు ఉయ్యాలవాడ వద్ద లెక్కించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు

ABOUT THE AUTHOR

...view details