నాగర్కర్నూల్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ జోరు చూపింది. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలకు గానూ 17 సీట్లను తెరాస గెలుచుకుంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించింది. జిల్లాలోని 211 ఎంపీటీసీ స్థానాలకు... 137 స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. 52 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. భాజపా 4 స్థానాల్లో గెలిచింది. వామపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. ఇతరులు 16 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించారు. తాజా ఫలితాలతో జిల్లాలోని తెరాస నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో కారు జోరు - PINK PARTY
నాగర్కర్నూల్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో తెరాస హవా సాగింది. గులాబీ పార్టీ జిల్లాలోని గరిష్ఠ జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుని విజయ భేరి మోగించింది. ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఎక్కువ స్థానాలు దక్కించుకుని సత్తా చాటింది.
ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో తెరాస హవా
ఇవీ చూడండి : ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీ
# | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మెుత్తం |
జడ్పీటీసీ | 17 | 3 | 0 | 0 | 20 |
ఎంపీటీసీ | 137 | 52 | 4 | 16 | 211 |
మండలాల వారీగా ఫలితాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
అచ్చంపేట | 8 | 0 | 0 | 0 | 8 |
అమ్రబాద్ | 1 | 8 | 0 | 0 | 9 |
బల్మూర్ | 8 | 2 | 0 | 1 | 11 |
బిజినపల్లి | 10 | 8 | 0 | 3 | 21 |
చారకొండ | 6 | 0 | 0 | 0 | 6 |
కల్వకుర్తి | 7 | 3 | 1 | 0 | 11 |
కోడేర్ | 5 | 3 | 0 | 5 | 13 |
కొల్లాపూర్ | 7 | 0 | 0 | 2 | 9 |
లింగాల్ | 5 | 5 | 0 | 0 | 10 |
నాగర్కర్నూల్ | 9 | 3 | 0 | 1 | 13 |
పదర | 5 | 0 | 0 | 0 | 5 |
పెద్దకొత్తపల్లి | 14 | 0 | 0 | 2 | 16 |
పెంటవెల్లి | 4 | 0 | 0 | 2 | 6 |
తాడూర్ | 7 | 2 | 0 | 1 | 10 |
తెల్కపల్లి | 9 | 5 | 0 | 0 | 14 |
తిమ్మాజిపేట | 9 | 2 | 1 | 0 | 12 |
ఉప్పునుంతల | 5 | 5 | 0 | 0 | 10 |
ఉర్కొండ | 6 | 0 | 0 | 0 | 6 |
వంగూర్ | 7 | 3 | 0 | 0 | 10 |
వెల్దండ | 5 | 3 | 2 | 1 | 11 |
Last Updated : Jun 5, 2019, 2:12 AM IST