రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని భాజపా యువజన మోర్చా నేత శివకృష్ణ విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్లో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'నిరుద్యోగ సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు' - తెలంగాణ భాజపా యువజన మోర్చా
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని బీజేవైఎం నేత శివకృష్ణ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూలు జిల్లాలో ధర్నా నిర్వహించారు.
'నిరుద్యోగ సమస్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు'
కరోనా సమయంలో తొమ్మిది నెలలుగా వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని శివకృష్ణ కోరారు. కార్యక్రమంలో భాజపా కార్యకర్తలు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రైవేటు బస్సులపై రవాణా అధికారుల నజర్