నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఈరోజు మహబూబ్ దర్గాలో భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ప్రసాదాలు తయారీ చేస్తుండగా పొగ రావడం వల్ల అక్కడ చెట్టుకు ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచాయి.
తేనెటీగలు దాడి.. 15 మందికి గాయాలు - భక్తులపై తేనెటీగలు దాడి
దర్గాలో మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడి చేయగా పలువురు పరుగులు తీశారు. దాదాపు 30 మందికి గాయాలు కాగా, 15 మందిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
తేనెటీగలు దాడి.. 15 మందికి గాయాలు
అది గమనించని సుమారు 30 మంది భక్తులకు గాయాలయ్యాయి. వారిలో 15 మందిని హూటాహుటిన కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని పెంట్లవెల్లి హాస్పిటల్కు తరలించారు.
ఇదీ చూడండి :భోజన పథకం బిల్లులేవీ ?? వంట ఎలా చేయాలి ?