నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని ముకురాల గ్రామానికి చెందిన కాశన్న అనే రైతు రెండు రోజుల కిందట పొలంలో పొక్లెయిన్‌తో భూమి చదును పనులు చేపట్టారు. పొలంలో బండరాయిని తొలగించాక... దాని కింద రెండు మట్టి పాత్రలు బయటపడ్డాయి. వాటిలో చూడగా 74 వెండినాణేలు లభించాయి.
పొలం చదును చేస్తుండగా... వెండినాణేలు లభ్యం - పురాతన వస్తువులు
భూమిని చదును చేస్తుండగా ఓ రైతుకు వెండినాణేలు లభ్యమయ్యాయి. ఇవి క్రీ.శ. 819 నాటివిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటన కల్వకుర్తి మండలంలో చోటు చేసుకుంది.
పొలం చదును చేస్తుండగా... వెండినాణేలు లభ్యం
సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తహశీల్దార్ రాంరెడ్డి, ఎస్సై మహేందర్, రెండు శాఖల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంచానామా చేశారు. ఇంకా ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉండొచ్చని పోలీసులు సోమవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. నాణేలపై ఉన్న అరబిక్ భాష ఆధారంగా సుమారు క్రీ.శ. 819 నాటివిగా అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి:కేసులు వెయ్యి.. చూసి అడుగెయ్యి!