ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో జడ్పీఛైర్ పర్సన్ కుసుమ జగదీశ్వర్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామంలో రూ. 22 లక్షల రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పాత అంగడని ఇటీవలె నర్సంపేట రోడ్డు ఇరువైపులా ఏర్పాటు చేసుకునేలా అనుమతిచ్చారు.
'ఆ అంగడిలో సరైన వసతులు కల్పించండి' - latest news of mulugu
ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలోని రైతు వేదిక స్థలానికి జడ్పీఛైర్ పర్సన్ కుసుమ జగదీశ్వర్ శంకుస్థాపన చేశారు. గ్రామంలోని నర్సంపేట రోడ్డులో పెట్టిన అంగడిలో సరైన వసతులు లేవంటూ వ్యాపారస్థులు ఆమెకు మొరపెట్టుకున్నారు.
మార్కట్లో సరైన వసతులు లేవంటూ వ్యాపారస్థుల నిరసన
కాగా పాత అంగడిలో నీడ ఉండేది. కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేవని కూరగాయులు, పప్పు దినులు ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోతున్నాయని.. తాము అమ్ముకునే వీలులేకుండా ఉందని వ్యాపారులు ఆమెకు మొరపెట్టుకున్నారు. రోడ్డుకిరువైపులా నీడలో ఉండి అమ్ముకునే విధంగా తగిన ఏర్పాటు చేస్తామని వ్యాపారులకు జడ్పీ ఛైర్పర్సన్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం