తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీ పల్లెల్లో అందుబాటులోకి 'సౌర' వెలుగులు - Wajedu zone of Mulugu district

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామంలోని ఇంటింటికీ సౌర వెలుగులు రానున్నాయి. వారికి సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

uthorities have shifted solar power equipment to Penugolu village, which is living in darkness in Wajedu zone of Mulugu district.
గిరిజన గ్రామాల్లో సౌర విద్యుత్ వెలుగులు

By

Published : Jan 25, 2021, 9:53 AM IST

ములుగు జిల్లా వాజేడు మండల గిరిజన గ్రామాల్లో సౌర విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హనుమంతు కె జండాగే చొరవతో.. రూ. 30 లక్షల నిధులతో సౌర విద్యుత్తు సామగ్రిని కొనుగోలు చేశారు. వాటిని సమీప కూలీల సహాయంతో కొండ ప్రాంతాలకు అధికారులు తరలించారు.

ఇంటింటికీ..

ప్రధాన రహదారి చీకుపల్లి గ్రామం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో, గుట్టపై ఏర్పాటు చేయనున్నారు. పెనుగోలు గూడెంలో నివసిస్తున్న 26 కుటుంబాలకు ఇంటింటికీ రెండేసి బ్యాటరీలు, ఇన్వెర్టర్లతో పాటు ప్యానల్ బోర్డులు ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి:ఇకపై నా దృష్టంతా ఆ రెండు విషయాలపైనే: మురళీమోహన్

ABOUT THE AUTHOR

...view details