మేడారం జాతర వైభవంగా జరుగుతుంటే అదే సమయంలో జంపన్న, సమ్మక్కలు పుట్టారు. మహారాష్ట్ర, చెన్నై నగరానికి చెందిన ఇద్దరు మహిళలు స్థానిక ఆసుపత్రిలో ప్రసవించారు. ఒక మహిళకు మగ బిడ్డ జన్మించగా.. మరో మహిళకు ఆడ శిశువు పుట్టింది. వారిలో మగ శిశువుకు జంపన్న అని.. ఆడ శిశువుకు సమ్మక్క అని నామకరణం చేశారు.
మేడారంలో పుట్టిన జంపన్న, సమ్మక్క - ములుగు జిల్లా
ఓ వైపు మేడారం జాతర వైభవం.. మరోవైపు పురిటినొప్పులతో ఇద్దరి మహిళల వేదన. ఆ ఇద్దరు మహిళలను వనదేవతలు చల్లగా చూశారు. ఒకరికి మగ శిశువును.. మరొకరికి ఆడ శిశువును ఇచ్చి ఆశీర్వదించారు. వారికి జంపన్న, సమ్మక్క అని పేరు పెట్టి ఆ తల్లులు మురిసిపోతున్నారు.
మేడారంలో పుట్టిన జంపన్న, సమ్మక్క
తల్లులను దర్శించుకునేందుకు వస్తే.. వారి చల్లని అనుగ్రహంతో సంతానం కలగిందని వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మలను తలుస్తూ వారి పేర్లనే పిల్లలకు పెట్టుకున్నామని ఆనందంగా చెప్తున్నారు.
ఇవీ చూడండి:గిరిజనుల నృత్యాల మధ్య గద్దె పైకి చేరుకున్న సమ్మక్క