వారం రోజులుగా తెలంగాణలో మావోల కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. డీజీపీ పర్యటన సందర్బంగా మావోయిస్టులు ఎక్కడ ఉన్నారో ఆచూకీ చెప్పిన వారికి నజరానా ప్రకటించారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు బహుమతి ఇస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు.
మావోయిస్టు అగ్ర నేతలు అజాద్, వెంకటేష్, భద్రు, సుధీర్, బిక్షపతి, మహేష్ ఫోటోలతో పోస్టర్లను ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.18మంది ముఖ్య నేతలు ఫోటోలు, పేర్లతో పోస్టర్లను అతికించారు. సమాచారం తెలిస్తే 100కి డయల్ చేసి చెప్పాలని... వివరాలు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు అంటున్నారు.
మావోల ఆచూకీ చెబితే రూ.5 లక్షల నుంచి 10లక్షల నజరానా - wall posters
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల ఆచూకీ చెప్పిన వారికి పోలీసు శాఖ నజరానా ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 నుంచి రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు నేతలు ఆజాద్, వెంకటేశ్, భద్రు, సుధీర్, భిక్షపతి, మహేశ్ ఫొటోలతో పోస్టర్లను ఏజెన్సీలో ఏర్పాటు చేశారు.
మావోల ఆచూకీ చెబితే రూ.5 లక్షల నుంచి 10లక్షల నజరానా