ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో అమానుషం చోటుచేసుకుంది. గ్రామ అభివృద్ధి పనులు చేస్తుండగా అడ్డుకున్నందుకు సూరయ్య అనే వ్యక్తిని జేసీబీతో డ్రైవర్ తోసేశాడు. సూరయ్య మద్యం మత్తులో జేసీబీ డ్రైవర్‌తో ఘర్షణకు దిగాడు. కోపోద్రిక్తుడైన డ్రైవర్ బొబ్బిలి, సూరయ్యను జేసీబీతో తోసేశాడు. ఫలితంగా సూరయ్యకు గాయాలయ్యాయి. స్థానికులు సూరయ్యను ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్ బొబ్బిలిని అదుపులోకి తీసుకున్నారు.
ములుగు జిల్లాలో అమానుషం.. పనులు అడ్డుకున్నందుకు జేసీబీతో దాడి - మంగపేటలో జేసీబీతో వ్యక్తిని తోసేసిన వార్తలు
ములుగు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. గ్రామ అభివృద్ధి పనులను అడ్డుకున్నందుకు ఓ వ్యక్తిని జేసీబీతో డ్రైవర్ తోసేశాడు.
అమానుషం: పనులు అడ్డుకున్నందుకు జేసీబీతో తోసేశారు
TAGGED:
ములుగు జిల్లా తాజా వార్తలు