తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలు

ఎండల నుంచి ఓటర్లు ఇబ్బందులు పడకుండా పోలింగ్ అధికారులు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు, వృద్ధులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు.

By

Published : May 10, 2019, 11:02 AM IST

అవసరమైన సదుపాయాలు ఏర్పాటు

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం , తాడ్వాయి మండలాల్లో రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మూడు జడ్పీటీసీలు, 20 ఎంపీటీసీలు స్థానాలు ఉండగా... 46వేల 891 ఓటర్లు, 103 పోలింగ్ కేంద్రంలాలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో వికలాంగులకు, వృద్ధులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు.

అవసరమైన సదుపాయాలు ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details