తెగిన రోడ్డు... రాకపోకలకు అడ్డు... - తెగిన రోడ్డు... రాకపోకలకు అడ్డు...
నిన్న రాత్రి కురిసిన వర్షానికి ములుగు జిల్లా పస్ర గ్రామంలోని రహదారి తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
road got damaged due to rain at mulugu district
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు తెగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి 363 పై రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన వానకు నీటి ఉధృతి పెరిగి రహదారి తెగిపోయింది. హన్మకొండ నుంచి ఏటూరునాగారం, మంగపేట వెళ్లే వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతర్గత రోడ్డు తెగిపోవడం వల్ల ప్రయాణికులు, స్థానికులు, ఉద్యోగులు వాగు దాట లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ఇదీ చూడండి : లాల్‌దర్వాజ అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం