తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు నాటితే భవిష్యత్​ తరాలకు లాభం - mla

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు ములుగు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. ఈసారి హరితహారంలో భాగంగా 86 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

భవిష్యత్​ తరాలకు లాభం

By

Published : Jul 3, 2019, 5:01 PM IST

ములుగు జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 86 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ హరితహారంపై సదస్సు నిర్వహించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బీఎఫ్​ఓ ప్రదీప్ కుమార్ శెట్టి హాజరయ్యారు. హరితహారం కార్యక్రమం ద్వారా వెంటనే లాభాలు రావని.. భవిష్యత్తు తరాలకు మేలు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ముక్కలు నాటి.. సంరక్షణ చర్యలు చేపడితే భావితరాలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.

86 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details