తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేసిన సీతక్క, కలెక్టర్ కృష్ణ

ములుగు మండలం జాకారం గ్రామ ఊర చెరువులో ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, జిల్లా పరిషత్ ఛైర్మన్ జగదీశ్వర్.. చేప పిల్లలు వేశారు. జిల్లాలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క
జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క

By

Published : Aug 27, 2020, 8:47 PM IST

ములుగు జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. మలుగు జిల్లా మండల కేంద్రంలోని జకారం గ్రామ ఊరచెరువులో ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్​ కృష్ణ ఆదిత్య, జడ్పీ ఛైర్మన్​ జగదీశ్వర్​ చేపపిల్లలను వేశారు.

ఈ ఏడాది జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలో ఉన్న 355 కుంటలు, చెరువుల్లో కోటి 15 లక్షల 44 వేల చేపపిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్​. ఏటూరునాగారం మండలంలో 17, గోవిందరావు పేటలో19, కన్నాయిగూడెంలో 6, మంగపేట 54, ములుగు మండలంలో 89, తాడ్వాయిలో 65, వెంకటాపూర్ 72, వెంకటాపురం మండలంలో 19, వాజేడు మండలంలో 14 చెరువుల్లో వీటిని వదులుతున్నట్లు ఆయన అన్నారు.

చేప పిల్లలు విడుదల చేస్తున్న ప్రతి చోట సహకార సంఘాల సమక్షంలో చేయాలని, ఫోటో, విడియో తీయించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చెరువు కట్టకు ఇరువైపులా మొక్కలు నాటారు.

ABOUT THE AUTHOR

...view details