విపత్కర సమయంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క సేవకు సరైన గుర్తింపు లభించింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆమెను విశిష్ఠ సేవా పురస్కార్‌తో సత్కరించబోతోంది.
సీతక్కకు అరుదైన గౌరవం... సేవకు పురస్కారం - ములుగు ఎమ్మెల్యే సీతక్క
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అరుదైన గౌరవం లభించింది. ఆమె సేవలకు గుర్తింపుగా పురస్కారం దక్కింది. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆమెకు విశిష్ఠ సేవా పురస్కార్‌కు ఎంపిక చేసింది.
సీతక్కకు అరుదైన గౌరవం... సేవకు పురస్కారం
ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు తుమ్మ అమరేష్, ప్రతినిధులు కిషోర్, రాజేందర్, తిరుపతిలు.. సీతక్కకు ధ్రువీకరణ పత్రం అందించారు. పౌండేషన్ తరఫున రెండు వందల కుటుంబాలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు. త్వరలో అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'పోస్ట్ ఇన్ఫో'తో ఔషధాలు, మాస్కులు డోర్ డెలివరీ