ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యే సీతక్క దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో మంగళపూర్ గ్రామ సమీపంలో ఓ రైతు పొలంలో కూలీలు వరి నాట్లు వేస్తూ ఉండగా చూసి ఆపి కూలీల వద్దకు వెళ్లారు. వారితో కలిసి నాటు వేశారు. నారుమడి నుంచి కట్టలు మోసుకొచ్చి కూలీలకు పంచారు. ఎమ్మెల్యే వచ్చి తమతో నాటు వేయడం ఎంతో సంతోషంగా ఉందని కూలీలు అన్నారు.
కూలీలతో కలిసి నాట్లు వేసిన ఎమ్మెల్యే సీతక్క
ఆమె ఒక ఎమ్మెల్యే అయినా.. ఏ మాత్రం దర్పం ప్రదర్శించదు. సాధారణ మహిళలా అందిరితో కలిసిపోతుంది. ఆమెకు కష్టం అంటే ఏమిటో తెసుసు.. పోరాటం అంటే ఏంటో కూడా తెలుసు.. ఆమె ములుగు ఎమ్మెల్యే సీతక్క. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో మంగళపూర్ వద్ద ఓ రైతు పొలంలో ఆమె నాటేశారు.
కూలీలతో కలిసి నాటు వేసిన ఎమ్మెల్యే సీతక్క