ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొండ్యాలతోగు, గొత్తికోయగూడెంలో 'హోప్ ఆఫ్ ది రిజెక్టెడ్' అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో 28 కుటుంబాలకు దోమ తెరలు, దుప్పట్లను ములుగు ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతల సహకారం మరువలేనిదని ఎమ్మెల్యే తెలిపారు. అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రభుత్వం చేయూతను అందించి సంక్షేమ ఫలాలను అందించాలని సీతక్క అన్నారు.
దోమతెరలు, దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క
అటవీ ప్రాంతాల్లో నివసించేవారికి ప్రభుత్వం చేయూతను అందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లాలోని మొండ్యాలతోగు, గుత్తికోయగూడెంలో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 28 కుటుంబాలకు దోమతెరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. అమృత తండాలో కరోనా సోకిన 32 మందిని పరామర్శించి బియ్యం, పప్పు, పండ్లు పంపిణీ చేశారు.
గోవిందరావు పేట మండలం అమృత తండాలో ఇటీవలే తీజ్ పండుగలో పాల్గొన్న 32 మందికి కరోనా సోకడం వల్ల వారిని పరామర్శించి... ఒక్కో కుటుంబానికి బియ్యం, పప్పు, పండ్లు అందించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని... కరోనా వచ్చినవారు ధైర్యంగా ఉండాలని సూచించారు. మంచి ఆహారం తీసుకొని.. ఆరోగ్య పరమైన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. వారందరికీ తాను అండగా ఉంటానని సీతక్క హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'రాష్ట్ర అవినీతిపై కేంద్రం డేగ కన్ను వేసింది'