ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. మేడారంలో హుండీ లెక్కింపు చేశారు. గత నెలలో జరిగిన మినీ మేడారం జాతర నుంచి.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద, గోవిందరాజులకు.. ఇప్పటివరకు భక్తుల నుంచి అందిన కానుకలను విడివిడిగా లెక్కించారు.
సమ్మక్క హుండీకి.. రూ. 43 లక్షల 95 వేలు, సారలమ్మకు రూ. 35 లక్షల 49 వేలు, గోవిందరాజుకు రూ. 2 లక్షలు, పగిడిద్దరాజుకు రూ. 96 వేల ఆదాయంతో పాటు పలు బంగారు, వెండి కానుకలు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.