ముకునూరుపాలెంకు చెందిన దుల్లయ్య, రామారావు, లక్ష్మయ్య, సోయం పెంటయ్య వెదురు బొంగులను సేకరించేందుకు అడవికి వెళ్లారు. అదివారం ఉదయం వెళ్లిన వీరు రాత్రి అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం తిరిగి వస్తుండగా... ప్రమాదవశాత్తు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ఘటనలో పెంటయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహన్ని పోలీసులు కటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అడవిలో ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయా అని గాలిస్తున్నారు.
ములుగులో మందుపాతర పేలి గిరిజనుడి మృతి - MANDHUPATHARA
తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో మందుపాతర పేలి ఒకరు చనిపోయారు. అదృష్టవశాత్తు మరో ముగ్గురు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ములుగులో మందుపాతర పేలి గిరిజనుడి మృతి
ఇవీ చదవండి:నేడు ఓరుగల్లులో కేసీఆర్ బహిరంగ సభ