ములుగు జిల్లాలోని రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొగ్గుల వాగు ఉప్పొంగి ప్రవహించడం వల్ల లక్నవరంలోకి భారీగా నీరు చేరుకుంది. సరస్సుకు 29 అడుగుల నీటిమట్టం చేరుకుంది. మరింతే వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 35 అడుగుల చేరుతుందని అధికారుల అంచనా.
29 అడుగుల నీటిమట్టానికి లక్నవరం సరస్సు - ములుగు
ములుగు జిల్లాలో రాత్రి నుంచి జోరుగా వానలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లక్నవరం సరస్సు నీటిమట్టం 29 అడుగులకు చేరుకుంది. ఇవాళ మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
29 అడుగుల నీటిమట్టానికి లక్నవరం సరస్సు