క్రిస్మస్ సందర్భంగా మేడారానికి పోటెత్తిన జనం - మేడారానికి పోటెత్తిన జనం
క్రిస్మస్ సెలవు రోజు పురస్కరించుకుని మేడారానికి భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సమ్మక్క, సారలమ్మలకు బెల్లాన్ని సమర్పించారు.
క్రిస్మస్ సందర్భంగా మేడారానికి పోటెత్తిన జనం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవును పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.