ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సులో భారీగా వరద నీరు చేరుతోంది. వర్షాలకు ముందు వరకు వెలవెలబోయిన సరస్సు నేడు నీటితో కళకళలాడుతోంది. సందర్శకులతో అక్కడ సందడి నెలకొంది. ప్రస్తుతం నీటి మట్టం 23 అడుగులు ఉంది. తాజా వర్షంతో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది.
నిన్న వెలవెల.. నేడు జలకళ - water
వారం రోజుల క్రితం వరకు వెలవెలబోయిన లక్నవరం సరస్సు ఇప్పుడు జలకళను సంతరించుకుంది. ములుగు జిల్లాలోని లక్నవరంకు నాలుగు రోజులుగా వరద నీరు వస్తోంది. సరస్సులో ప్రస్తుతం 23 అడుగుల నీటిమట్టం ఉంది.
బోటింగ్ చేస్తున్న సందర్శకులు