రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో ములుగులో నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇలా పెంచుకుంటూ పోతే సరఫరా అయ్యే ప్రతీ వస్తువు ధరలు పెరిగి... ప్రజల జేబులకు చిల్లులు పడతాయన్నారు.
'పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యుడిపై పెనుభారం' - left parties protest
ములుగులో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వామపక్ష నాయకులు మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ వామపక్షాల నిరసన
ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.