తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం - నేటి నుంచి ములుగు జిల్లా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. పది నెలలుగా ఎదురుచూస్తున్న శుభగడియలు వచ్చేశాయ్. కోట్లాది మంది ప్రజల ఆశలు... నెరవేరే సమయమూ ఇదే. కంటి మీద కనుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి నిర్మూలన కోసం... రేయింబవళ్లు పడిన శ్రమ ఫలించి టీకా అందుబాటులోకి వచ్చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీకా వేసేందుకు...అధికారులు పూర్తి స్ధాయిలో సన్నద్ధమయ్యారు.

covid vaccine distribution starts from today onwards in mulugu district
నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

By

Published : Jan 16, 2021, 5:15 AM IST

Updated : Jan 16, 2021, 5:51 AM IST

వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొవిడ్ టీకా పంపిణీకి సర్వం సిద్ధమైంది. 21 కేంద్రాలను వ్యాక్సిన్ కోసం ఎంపిక చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయకరరావు... వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 6, 330 డోసుల వ్యాక్సిన్ జిల్లాలకు ఇప్పటికే చేరుకుంది. ఇటు వ్యాక్సిన్ వేసిన తరువాత... అవసరమైనవారి కోసం.. ఎంజీఎంలో పదిపడకలను కూడా ముందు జాగ్రత్తగా సిద్ధం చేశారు.

వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు...

వరంగల్ అర్బన్ జిల్లా

ఎంజీఎం ఆసుపత్రి, కమలాపూర్-పీహెచ్​సీ, హసన్​ పర్తి-పీహెచ్​సీ, దేశాయ్​పేట-పీహెచ్​సీ, వంగర-పీహెచ్​సీ, పోచమ్మకుంట-యూపీహెచ్​సీ

వరంగల్ గ్రామీణ జిల్లా

ఆత్మకూరు-పీహెచ్​సీ వర్ధన్నపేట-సీహెచ్​సీ, నర్సంపేట-సీహెచ్​సీ, పరకాల-సీహెచ్​సీ

మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్-యూపీహెచ్​సీ, కంబలాపల్లి-పీహెచ్​సీ,డోర్నకల్-పీహెచ్​సీ, తొర్రూరు-పీహెచ్​సీ

ములుగు జిల్లా

ములుగు ఏరియా ఆసుపత్రి, ఏటూరినాగారం-సీహెచ్​సీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

భూపాలపల్లి-పీహెచ్​సీ, చిట్యాల-సీహెచ్​సీ, మహదేవ్​పూర్-సీహెచ్​సీ

జనగామ జిల్లా

జనగామ ఏరియా ఆసుపత్రి, పాలకుర్తి-పీహెచ్​సీ

ఇదీ చూడండి:కరోనా మహమ్మారిపై సమరం.. నేటి నుంచి వ్యాక్సినేషన్

Last Updated : Jan 16, 2021, 5:51 AM IST

For All Latest Updates

TAGGED:

mulugu

ABOUT THE AUTHOR

...view details