తెలంగాణ గిరిజన మహా జాతర మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధిలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వధూవరులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
సమ్మక్క సారలమ్మల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన జంట - couple got married in medaram jatara
భక్తుల కొంగు బంగారమై, కోరిన కోర్కెలు తీర్చే మేడారం సమ్మక్క సారలమ్మల సమక్షంలో.. జాతర సందర్భంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
సమ్మక్క సారలమ్మల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన జంట
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరివంచ మండలం పాత గూడ గ్రామానికి చెందిన మునేశ్వర్, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా భూపాలపట్నం లింగాపూర్ గ్రామానికి చెందిన సవితను ఇరు కుటుంబాల సమక్షంలో వివాహమాడాడు.
మేడారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద వీరి కల్యాణం జరిగింది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులతోనే పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చామని వధూవరులు తెలిపారు.
- ఇదీ చూడండి :తుపాకులు పట్టిన జవానుల చేతుల్లో చీపుర్లు