ములుగు జిల్లాలోని 16 వ్యాక్సిన్ సెంటర్లలో వైద్య సిబ్బంది కో వ్యాక్సిన్ రెండో డోస్ వేస్తున్నారు. జిల్లాలోని రాయినిగూడెం, వెంకటాపూర్, గోవిందరావుపేట, పస్రా, కొడిశాల, తాడ్వాయి, రొయ్యూరు, కన్నాయిగూడెం, మంగపేట, చుంచుపల్లి, వాజేడు, పేరూరు, బ్రాహ్మణపల్లి, ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వెంకటాపురం, ఏటూరునాగారం సామాజిక కేంద్రాలు ములుగు ఏరియా ఆసుపత్రిలో కూడా కరోనా రెండో డోసు టీకాను ఇస్తున్నారు.
ములుగులో ప్రశాంతంగా కరోనా రెండో డోస్ వ్యాక్సినేషన్ - corona second dose vaccination in Mulugu
ములుగు జిల్లా వ్యాప్తంగా కరోనా రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. వచ్చిన వాళ్లందరికీ వైద్య సిబ్బంది టీకాలు ఇస్తున్నారు.
ములుగులో ప్రశాంతంగా కరోనా రెండో డోస్ వ్యాక్సినేషన్
ఒక్కో సెంటర్లో కనీసం 100 మందికి టీకాలు వేసేందుకు సిద్ధమైన వైద్య సిబ్బంది ఎక్కువ మంది రావడంతో మరింత మందికి కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ... టీకాలు తీసుకోవాలని వైద్య సిబ్బంది ప్రజలకు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి :ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా