ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలోని పొలాల్లో కంకి విరిచిన మొక్కజొన్నకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. పొలంలోనే కల్లం చేసి కాంటైన ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫలితం లేకపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే బస్తాలు చాలా వరకు కాలిపోయాయి.
కళ్లముందే మొక్కజొన్న దగ్ధం... కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ప్రమాదవశాత్తు రైతులు కల్లం చేసి... బస్తాల్లో నింపి పెట్టిన ధాన్యం కళ్లముందే కాలిపోయింది. చేతినిండా పంట వచ్చిందని ఆనందపడ్డ... ఆ రైతులకు బూడిద మిగిలింది.
Corn grain burnt in Fire accident in mulugu
ఎంతో శ్రమ పడి పండించిన పంట కలిపోవడాన్ని చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఈ ప్రమాదంలో లక్షా 60 వేల రూపాయల విలువ గల 180 మొక్కజొన్న బస్తాలు బుగ్గి పాలైనట్టు బాధిత రైతులు తెలిపారు.