తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులపై కేసీఆర్​కు సవతి తల్లి ప్రేమ' - MULUGU MLA

రైతులకు గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో పట్టా పాసు పుస్తకాలను అందజేయాలంటూ ములుగు శాసన సభ్యురాలు సీతక్క ఆందోళన నిర్వహించారు. రైతు లేనిదే రాజ్యం లేదన్న కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే... సవతి తల్లి ప్రేమ చూపినట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

'రైతులపై కేసీఆర్​కు సవతి తల్లి ప్రేమ'

By

Published : Jun 15, 2019, 3:22 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో రైతులకు మద్ధతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి రైతులకు సకాలంలో పట్టా పాసు పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు 95 శాతం పాసు పుస్తకాలు అందజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఏకకాలంలో రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలను ఇస్తామని చెప్పి మోసగించారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

'రైతులపై కేసీఆర్​కు సవతి తల్లి ప్రేమ'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details