గిరిజన సంప్రదాయాలను కళ్లకు కట్టే సమ్మక్క సారలమ్మ జాతర మేడారానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులను తరలించే ఆర్టీసీ... వివిధ ప్రాంతాల నుంచి బస్సు ఛార్జీల వివరాలు వెల్లడించింది.
మహారాష్ట్ర లోని సిరోంచ నుంచి మేడారానికి 300 రూపాయలూ..వసూలు చేయనున్నారు. కాళేశ్వరం నుంచి మేడారానికి ప్రస్తుత ఛార్జీ 260 రూపాయలైతే వరంగల్ నుంచి మేడారానికి 190 రూపాయలుగా ఛార్జీలను ఆర్టీసీ నిర్ణయించింది. 2018 తో పోలిస్తే....ఈ ప్రాంతాలనుంచి 30 రూపాయల నుంచి 50 రూపాయల మేర పెరుగుదల కనిపించింది.
ఇవి కేవలం ఎక్స్ ప్రెస్ బస్సుల ఛార్జీలు మాత్రమే. డీలక్స్, సూపర్ లక్జరీ బస్సులకు ఛార్జీల వివరాలు ఇంకా వెల్లడించలేదు. వివిధ ప్రాంతాలనుంచి మేడారానికి ఆర్టీసీ దాదాపు 4వేలకు పైగా బస్సులు నడిపనుంది. అందుకోసం మేడారంలో బస్టాండ్ నిర్మాణం ఇతర ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయ్.