వరద నీటిలో చిక్కుకున్న మేడారం భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. 23 మంది భక్తులను ములుగు పోలీసులు రక్షించారు. ములుగు జిల్లాలోని జంపన్నవాగు పొంగడంతో ఉదయం అటుగా వెళ్లిన 23 మంది భక్తులు తిరిగి రాలేకపోయారు. రహదారిపైన వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనంలో వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించక ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ములుగు డీఎస్పీ విజయసారధి ఆధ్వర్యంలో పోలీసులు.. స్థానికుల సాయంతో సురక్షితంగా వాగుదాటించారు. కాపాడిన వారిలో 17 మంది వరంగల్, హన్మకొండ వాసులు కాగా...మిగతా వారంతా ఆర్మూరుకు చెందినవారు.
వరద నీటిలో చిక్కుకున్న 23 మంది భక్తులు సురక్షితం - flood
మేడారానికి వెళ్తూ వరదనీటిలో చిక్కుకున్న 23 మంది భక్తులను ములుగు పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
భక్తులను తీసుకొస్తున్న పోలీసులు
ఇవీ చూడండి: తెలంగాణ చిన్నమ్మ ఇకలేరు