తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాస్వామ్య స్ఫూర్తి: మెల్బోర్న్‌ వచ్చి... ఓటేశారు

ఓటు వేయాలని ఎంత అవగాహన కల్పించినా కొందరు పోలింగ్‌లో పాల్గొనడం లేదు. సెలవు ప్రకటించినా ఓటు వేయడానికి ఆసక్తి చూపరు. కానీ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం విదేశాల నుంచి వచ్చి చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ యువకుడు. తన ఓటు వేయడం కోసం దేశం కాని దేశం నుంచి వచ్చిన యువకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని పలువురు అభినందిస్తున్నారు.

young-man-return-to-india-from-melbourne-for-voting
ప్రజాస్వామ్య స్ఫూర్తి: మెల్బోర్న్‌ వచ్చి... ఓటేశారు

By

Published : Dec 1, 2020, 5:44 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాల్గొనడానికి మెల్బోర్న్‌ నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓ యువకుడు. జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ శంకరయ్య కుమారుడు రిత్విక్ ఉన్నత విద్యాభ్యాసం కోసం మెల్బోర్న్‌కు వెళ్లారు. జనవరి చివర్లో హైదరాబాద్‌కు రావాల్సిన రిత్విక్... ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగానే వచ్చారు.

రిత్విక్‌ తన తల్లిదండ్రులతో కలిసి పేట్‌ బషీరాబాద్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికే విదేశాల నుంచి వచ్చిన రిత్విక్‌కు ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని పలువురు అభినందిస్తున్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తి: మెల్బోర్న్‌ వచ్చి... ఓటేశారు

ఇదీ చదవండి:సంగారెడ్డిలో ప్రశాంతంగా పోలింగ్: ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details