తెలంగాణ

telangana

ETV Bharat / state

వీఆర్ఏగా తండ్రికి బదులు కుమారుడు చలామణి - Gajularamaram vra suspend news

ప్రభుత్వ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని మేడ్చల్ జిల్లా గాజులరామారం వీఆర్ఏను కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సస్పెండ్ చేశారు.

వీఆర్ఏగా తండ్రికి బదులు కుమారుడు చలామణి
వీఆర్ఏగా తండ్రికి బదులు కుమారుడు చలామణి

By

Published : Jul 27, 2020, 9:30 PM IST

ప్రభుత్వ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని మేడ్చల్ జిల్లా గాజులరామారం వీఆర్ఏను కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సస్పెండ్ చేశారు. మేడ్చల్ జిల్లా గాజులరామరంలో రక్షించించాల్సిన ప్రభుత్వ భూములను కబ్జాదారులతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నాడని తహసీల్దార్​కు పలు ఫిర్యాదులు అందాయి.

ఈ మేరకు వీఆర్ఏ బాలయ్యను తహసీల్దార్ గౌరివత్సల సస్పెండ్ చేశారు. బాలయ్యకు (వీఆర్ఏ) అనారోగ్యం కారణంగా కొన్నాళ్లుగా కుమారుడు ఉప్పరి వాసు వీఆర్ఏగా చలామణి అవుతున్నాడు. తహసీల్దార్​కు ఫిర్యాదులు రాగా.. తండ్రిని సస్పెండ్ చేసి కుమారుడిపై దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details