తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగజీవిపై పైశాచికత్వం... - మేడ్చల్ జిల్లా

మూగ జీవి మెడ కోసి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా గబ్బిలాలపేట్‌లో చోటుచేసుకుంది.

మూగజీవిపై పైశాచికత్వం...

By

Published : Sep 1, 2019, 6:58 PM IST

మేడ్చల్ జిల్లా గబ్బిలాలపేట్‌లోని గిరిప్రసాద్‌ నగర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కుక్క మెడ కోసి హతమార్చడానికి యత్నించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శునకాన్ని గమనించిన స్థానికులు పశు వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల శునకాన్ని పశు వైద్యశాలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది రాజు అనే వ్యక్తి అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు.

మూగజీవిపై పైశాచికత్వం...

ABOUT THE AUTHOR

...view details